Bomb Threat | విమానంలో బాంబు ఉందంటూ కొందరు ఆకతాయిలు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల సిబ్బందితోపాటు, ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తాజాగా ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే విమానానికి బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం కలకలం రేపుతోంది.
ఎయిర్ కెనడా (Air Canada)కు చెందిన విమానం మంగళవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో (Delhi – Toronto Flight)కు బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (Delhi International Airport Limited) కార్యాలయానికి రాత్రి 10:50 గంటల సమయంలో ఈమెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా.. బెదిరింపు బూటకమని తేలింది. బాంబు బెదిరింపు అనంతరం ప్రోటోకాల్‌ను అనుసరించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలూ కనిపించలేదని చెప్పారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Naveen Patnaik | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి.. సీఎం పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా
Supriya Sule | బారామతి స్థానం సుప్రియా సూలేదే.. ఉత్కంఠ పోరులో వదినపై ఘన విజయం
Chandrababu | మేం ఎన్డీయేలోనే ఉన్నాం.. కూటమి భేటీకి హాజరవుతున్నాం : చంద్రబాబు