(Pushpa Yagam) చిత్తూరు : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవోపేతంగా పుష్పయాగం జరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏడు టన్నుల పువ్వులతో టీటీడీ ఆధ్వర్యంలో ‘పుష్ప కైంకర్యం’ నిర్వహించారు. పుష్పయాగంలో భాగంగా ఆలయ కల్యాణ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించిన పుష్ప కైంకర్యంలో ఏడు టన్నుల పూలను ఉపయోగించారు. ఈ పువ్వులను తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన దాతలు అందజేశారు.
ఇలాఉండగా, తిరుమల శ్రీవారిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తితిదే ఆధికారులు వారికి సాదర స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..