(Social Forest Farmers) ఒంగోలు: గతంలో ఇచ్చిన హామీలతో పాటు తమ 10 డిమాండ్లను పరిష్కరించాలని ఏపీ సామాజిక అటవీ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాజకీయాలకు అతీతంగా ఈ నెల 10 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలువాలని నిర్ణయించారు. కలప టన్నుకు రూ.5 వేలతో పాటు కలప గుజ్జు తదితరాలపై దిగుమతి సెస్ విధించేలా కేంద్రాన్ని ఒప్పిస్తానని తన పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
సామాజిక అటవీ రైతులు చేపట్టిన నిరసనల అనంతరం, పేపర్ మిల్లుల ప్రతినిధులు, రైతులతో ఆమోదయోగ్యమైన ధరపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2016 జనవరిలో ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని నియమించింది. సుబాబుల్ టన్ను రూ.4,400, యూకలిప్టస్, సరుగుడు రూ.4,600 చొప్పున కొనుగోలు చేసేందుకు కంపెనీలు అంగీకరించాయని పలు సమావేశాల అనంతరం మంత్రులు ప్రకటించారు. రైతుల సమక్షంలోనే గుర్తించిన తూకంలో కలపను పేపర్ మిల్లులు కొనుగోలు చేసేలా చూడాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్, డైరెక్టర్‌కు 2016 ఫిబ్రవరిలో జీఓఆర్టీ నంబర్ 143 పేరిట మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ మార్గదర్శకాలను మిల్లుల యాజమాన్యాలు పట్టించుకోలేదు. దాంతో కొన్ని చోట్ల రైతులకు టన్నుకు కేవలం రూ.2000 మాత్రమే అందింది, అది కూడా నెలల తర్వాత చెల్లింపు జరిపారు.
ప్రభుత్వం అంగీకరించిన ధరలు అమలు కాకపోవడంతో సుబాబుల్, యూకలిప్టస్, సరుగుడు రైతులు ఎకరాకు సుమారు రూ.60 వేలు నష్టపోతున్నారని సామాజిక అటవీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి విచారం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్ర సందర్భంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సామాజిక వనాల ఏర్పాటుకు సహకరిస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టన్నుకు రూ.5 వేలు చొప్పున అందజేస్తామని పలు సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు.
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..