CM Jagan: ఈనెల 20 నుంచి క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ : సీఎం జగన్
CM Jagan : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్లను ఈనెల 20 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకం లబ్ధిదారులకు...

(CM Jagan) అమరావతి : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్లను ఈనెల 20 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకం లబ్ధిదారులకు క్లియర్ టైటిల్‌తో రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను డిసెంబరు 15 వరకు కొనసాగించాలని, పూర్తి పారదర్శకత పాటించాలని అధికారులను గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈమేరకు ముఖ్యమంత్రి ఆదేశించారు. సమీక్షకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల గుర్తింపుపై చర్చించారు.
ఈ పథకం కింద ఇప్పటివరకు 52 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 45.63 లక్షల లబ్ధిదారుదాల డాటాను ఇప్పటికే సచివాలయాలకు ట్యాగ్ చేసినట్లు వెల్లడించారు. వీరిపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 10 రోజుల్లో పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. డిసెంబరు 15 లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని ఈ సందర్భంగా అధికారులకు జగన్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
7వేల మంది అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

