ఏపీలో భారీ వర్షాలు పడి చాలా ప్రాంతాలు జలమయం అయిన విషయం తెలిసిందే. రాయలసీయలోని చాలా ప్రాంతాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడి వరద పోటెత్తింది. చాలామంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడాయి.
అయితే.. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు మొత్తం వరదలో చిక్కుపోయింది. నెల్లూరులోని కొడవలూరులో ఉన్న శివుడి గుడిలో పనిచేసే పూజారి తన బైక్ మీద వెళ్తూ వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ వద్ద వరదకు బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. తన బైక్ వరదలో కొట్టుకుపోగా.. వరద నీళ్లలో చిక్కుకుపోయిన పూజారి.. సహాయం కోసం అరిచాడు.
వరదలో చిక్కుకున్న పూజారిని గమనించిన ట్రాఫిక్ సీఐ శ్రీనాయక్.. వెంటనే తాడు సాయంతో పూజారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాడు. పూజారిని కాపాడాక.. ఒక్కసారిగా పూజారి భావోద్వేగానికి గురయ్యాడు. పోలీసును పట్టుకొని ఏడ్చాడు. ఏం కాలేదులే అని పూజారికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి పంపించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఏపీ పోలీస్ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#APPolice Cyclone Rescue Operations :
— Andhra Pradesh Police (@APPOLICE100) November 21, 2021
A priest working at the Kodavalur Shiva temple in #Nellore Dist was riding his bike at Venkateswarapuram bridge when he was swept away by the flood waters & was shouting for the help,while Traffic CI Sri Nayak dared to bring the priest safely pic.twitter.com/qEP4mANXZk
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఫుడ్ ప్రిపేర్ చేశాడు.. రోడ్డు అవతల ఉన్న వ్యక్తి పైకి విసిరేశాడు.. వైరల్ వీడియో
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం.. రూపాయి కూడా ఇవ్వాల్సిన పనిలేదు.. ఎలాగో తెలుసా?
మహిళా ఉద్యోగి వెరైటీ రాజీనామా లెటర్.. కంగుతిన్న బాస్.. ఇంతకీ ఆ లెటర్లో ఏముందో తెలుసా?
ఇంట్లో దూరాడు.. సైకిల్ దొంగతనం చేయబోయాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నవ్వాపుకోలేరు