నిర్బంధం నుంచి వాంగ్చుక్కు విముక్తి
ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జోధ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై పెట్టిన కేసును కేంద్రం శనివారం ఎత్తివేసింది.
- జైలు నుంచి విడుదల
న్యూఢిల్లీ, మార్చి 14: ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ జోధ్పూర్ జైలు నుంచి విడుదలయ్యారు. జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అతనిపై పెట్టిన కేసును కేంద్రం శనివారం ఎత్తివేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన మధ్యాహ్నం 1.30 గంటకు జైలు నుంచి విడుదలయ్యారు. లద్దాఖ్లో శాంతియుత వాతావరణం, స్థిరత్వం, పరస్పర విశ్వాసం పెంపొందించడానికి, నేతలతో అర్థవంతమైన చర్చలు జరపడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం శాఖ తెలిపింది. లద్దాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేసిన ఆయనను కేంద్ర ప్రభుత్వం 2025, సెప్టెంబర్ 26న ఎన్ఎస్ఏ చట్టం కింద అరెస్ట్ చేసి నిర్బంధించింది. తర్వాత అతడిని జోధపూర్ జైలుకు తరలించారు. దీనిపై ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో గత ఏడాది అక్టోబర్ 6న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అతని బెయిల్పై సుప్రీంలో విచారణ సాగుతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- Jail
- Ladakh activist
- NSA
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

