ఎల్పీజీ సరఫరాపై కమాండ్ కంట్రోల్ సెంటర్.. అందుబాటులోకి 1967 టోల్‌ఫ్రీ నంబర్
ఎల్పీజీ సరఫరాలో అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్రంలో 24/7 ‘మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్'ను శనివారం సివిల్ సైప్లె శాఖ ఏర్పాటుచేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఎల్పీజీ సరఫరాలో అనిశ్చితి నేపథ్యంలో రాష్ట్రంలో 24/7 ‘మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్’ను శనివారం సివిల్ సైప్లె శాఖ ఏర్పాటుచేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. సరఫరాలోని ఇబ్బందులు గుర్తించేందుకు 1967 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గ్యాస్ సరఫరాను ఈ కేంద్రం పర్యవేక్షిస్తుందని, సరఫరాలో ఉన్న అడ్డంకులను గుర్తించి సమస్యలను పరిష్కరించనున్నట్టు తెలిపారు.
రవాణా, లాజిస్టిక్స్, అందుబాటులో ఉన్న గ్యాస్ సిలిండర్ల నిల్వను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత కోసం చమురు కంపెనీలు వెంటనే జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థలను అందుబాటులోకి తేవాలని కోరారు. సరఫరాలో ఇబ్బందులను అధిగమించేందుకు ఇండియన్ ఆయిల్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్) ప్రతినిధులు, పోలీసులు, పరిశ్రమలు, పంపిణీదారులు కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిరంతరం అందుబాటులో ఉండి పర్యవేక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

