(Night Curfew in AP)అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటుంది. థర్డ్ వేవ్ ముప్పును ముందుగానే పసిగట్టిన ప్రభుత్వం ఆ మేరకు ముందస్తు చర్యలు చేపట్టింది. అలాగే, థియేటర్లు, మాల్స్ నిర్వహణపై కూడా కఠిన చర్యలు చేపట్టింది. నైట్ కర్ఫ్యూ ఇవాల్టి నుంచే అమలు చేసేలా ఉత్తర్వులు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఎప్పటివరకు కొనసాగుతుందనేది కూడా ఉత్తర్వుల్లో స్పష్టం చేస్తారని అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యలో జగన్ సర్కార్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తిపై ఇవాళ అధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్.. ఈ మేరకు నైట్ కర్ఫ్యూ విధించేందుకే మొగ్గు చూపారు. థర్డ్ వేవ్ ముప్పు వచ్చినట్లయితే ఎలా ఎదుర్కోవాలని అనే అంశంపై అధికారులను ఆరాతీశారు. సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూడాలని అధికారులను జగన్ ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు తప్పనిసరిగా అమలయ్యేట్లు చూడాలన్నారు. మాల్స్, థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ వేళ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించనివారికి జరిమానా విధించాలని సూచించారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పారు.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..