Mediterranean Diet: ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
Mediterranean Diet: మెడిటరేనియన్ డైట్ ప్రపంచంలోనే అత్యత్తమ డైట్‌గా వరుసగా ఐదో ఏడాది ఎంపికైంది. ఈ అవార్డును యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అందజేస్తుంది. వివిధ డైట్లను ఆసాంతం పరిశీలించిన...

(Mediterranean Diet) మెడిటరేనియన్ డైట్ ప్రపంచంలోనే అత్యత్తమ డైట్‌గా వరుసగా ఐదో ఏడాది ఎంపికైంది. ఈ అవార్డును యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ అందజేస్తుంది. వివిధ డైట్లను ఆసాంతం పరిశీలించిన తర్వాతనే అత్యుత్తమ డైట్‌ను ఎంపికచేస్తారు. గత ఐదేండ్లుగా అత్యుత్తమ డైట్‌గా ఎంపికవుతున్న మెడిటరేనియన్ డైట్‌ను అనుసరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మధుమేహం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, రొమ్ము క్యాన్సర్, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని వారు చెప్తున్నారు. అలాగే, వేగంగా బరువు తగ్గడంలో, మనస్సును యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.
మెడిటరేనియన్ డైట్ అనేది మొక్కల ఆధారిత ఆహారం. ఈ డైట్లో పండ్లు, కూరగాయలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలను ఈ డైట్లో చేర్చారు. పచ్చి ఆలివ్ నూనెను కొవ్వుగా ఉపయోగిస్తారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు. ఈ ఆహారంలో చక్కెర, ఎర్ర మాంసం, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్, పాల ఉత్పత్తులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. పరిమిత పరిమాణంలో ఆల్కహాల్ తాగడం కూడా మంచిదేనంటారు. శుద్ధి చేసిన నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఈ డైట్ నుంచి నిషేధించారు.
మెడిటరేనియన్ డైట్‌తో ప్రయోజనాలివీ..
గుండె ఆరోగ్యంగా ఉంటుంది: మెడిటరేనియన్ ఆహారాన్ని అనుసరించడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డిప్రెషన్ ప్రమాదం తక్కువ: ఈ ఆహారాన్ని అనుసరించే వ్యక్తులు ఇతరులతో పోలిస్తే 33 శాతం తక్కువ డిప్రెషన్‌కు గురవుతారు.
మనస్సు యవ్వనంగా మారుతుంది: ఈ డైట్ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుండటం వల్ల మనసుకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మానసిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.
లాంగ్ లైఫ్: ఈ డైట్ సహాయంతో ఎక్కువ కాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జీవితకాలంలో ఎక్కువ వ్యాధులు ఉండకపోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.
ఎముకలు దృఢంగా ఉంటాయి: ఈ ఆహారం స్త్రీల ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది. ఈ ఆహారంలో ఉండే పోషకాలు ఎముకల జీవక్రియను పెంచుతాయి.
రొమ్ము క్యాన్సర్ నివారణ: ఈ ఆహారాన్ని నిరంతరం ఫాలో అయ్యే వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుంది.
మధుమేహం అదుపులో ఉంటుంది: మెడిటరేనియన్ డైట్‌ని అనుసరించడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. ఈ ప్రయోజనాలతో పాటు వేగంగా బరువు తగ్గడం, అంగస్తంభన లోపాన్ని సవరించుకోవడానికి, చిత్తవైకల్యం తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
Kangana Ranaut | 17 ఏండ్ల తర్వాత టాలీవుడ్లోకి కంగనా రనౌత్.. రవిబాబు దర్శకత్వంలో క్రేజీ హారర్
Unanimous panchayats | ఏపీలో ఏకగ్రీవ పంచాయతీలకు గుడ్‌న్యూస్..భారీగా పెంచిన ప్రోత్సాహం
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

