Carona Recovery: ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
Carona Recovery: ...ఇటువంటి పరిస్థితిలో కరోనా నుంచి కోలుకునే మార్గాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే, భవిష్యత్‌లో దీర్ఘకాల కొవిడ్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం...

(Carona Recovery) గత రెండున్నరేండ్లుగా ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నది. రూపాలు మార్చుకుంటూ కొత్త వేరియంట్‌గా మనపైకి దండెత్తుకు వస్తున్నది. ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో మనల్ని వెంటాడుతున్నది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచంలోని 6 దేశాల్లో 24 గంటల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా కొత్తగా కరోనా సోకింది. ఇటువంటి పరిస్థితిలో కరోనా నుంచి కోలుకునే మార్గాల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే, భవిష్యత్‌లో దీర్ఘకాల కొవిడ్ ప్రమాదాన్ని తగ్గించడానికి కొన్ని చిట్కాలను అనుసరించడం చాలా ముఖ్యం.
హైడ్రేటెడ్‌గా ఉంచడం..

శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచడం చాలా ముఖ్యం. కరోనా నుంచి బయటపడేందుకు ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంపై కొవిడ్ వైరస్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెప్తున్నారు. ఎక్కువ నీరు తాగడం వలన శరీరం పనితీరు కూడా సక్రమంగా జరుగుతుంది.
విశ్రాంతి అవసరం..

ఏ వ్యాధి నుంచైనా కోలుకోవాలంటే ముఖ్యంగా మనం విశ్రాంతి తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. కరోనా వైరస్‌కు గురైన వారు కూడా దీని నుంచి బయటపడేందుకు శరీరానికి గరిష్ట మొత్తంలో విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఈ చిట్కాను విస్మరించడం ద్వారా భవిష్యత్‌లో దీర్ఘకాలం కొవిడ్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.
పోషకాహారం కావాలి..

అనారోగ్యానికి గురైన సమయంలో మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకాలు అందాలి. అందుకు ఆహారం ద్వారా ఎక్కువ పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు భోజనంలో భాగంగా చేసుకోవాలి. వేపుడ్లు, మసాలా ఫుడ్, జంక్ ఫుడ్, శీతల పానీయాలు, ఆల్కహాల్ అస్సలు తీసుకోకుండా చూడాలి.
వ్యాయామం మరవొద్దు..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తేలికపాటి వ్యాయామం చేయాలి. యోగా సాధన కూడా మంచి ఫలితాన్నిస్తుంది. అనులోమ విలోమ, కపాలబాతి వంటి ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలంగా తయారవుతుంది. అలాగే, కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత సాధారణ వ్యాయామాలతో ప్రారంభించి ఎక్కువ వర్కవుట్లు చేయాలి.
మానసిక ఆరోగ్యం ముఖ్యం

కరోనా మహమ్మారి మన మానసిక ఆరోగ్యానికి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారి శరీరం బలహీనపడటమే కాకుండా ఆ వ్యక్తి మానసికంగా కూడా బలహీనంగా మారతాడు. ఆందోళన, ఒత్తిడి మన అనారోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తాయి. అందుకని, రికవరీ సమయంలో ధ్యానం లేదా కొత్త అభిరుచులను అలవాటు చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

