(Accident @ Vizag) విశాఖ : ఇటీవలనే పెండ్లి చేసుకున్న ఓ జంట.. బంధువులతో కలిసి అలా సరాదాగా బయటకు వెళ్లగానే.. కారు రూపంలో మృత్యువు ఎదురొచ్చింది. సరదాగా మాట్లాడుకుంటూ బైక్‌పై వెళ్తున్న ఈ జంటను వెనక నుంచి కారు ఢీకొన్న ఘటనలో భార్య అక్కడికక్కడే మృతిచెందింది. సెకండ్ల వ్యవధిలో ఆ నవ వధువు ప్రాణాలు అర్ధంతరంగా గాల్లో కలిసిపోయాయి. విశాఖ జిల్లా పాడేరు మండలం వంతాడపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
వివాహ బంధంతో ఒక్కటైన తరుణ్ కుమార్, హేమ బంధువులతో కలిసి పర్యాటక కేంద్రమైన వంజంగికి మూడు బైకులపై బయల్దేరారు. వంతాడపల్లె చెక్‌పోస్ట్ వద్దకు వారు చేరుకోగానే నవదంపతులు ప్రయాణిస్తున్న బైక్‌ను వెనక నుంచి ఓ కారు ఢీకొట్టింది. దాంతో నవ వధువు హేమ (24) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పొయింది. ఆమె భర్త తరుణ్ కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తరుణ్ కుమార్ చికిత్స నిమిత్తం 108 వాహనంలో పాడేరు దవాఖనాకు తరలించారు. తరుణ్, హేమల వివాహం మూడు నెలల కిందటే జరిగినట్లు తెలుస్తున్నది. నవ వధువు మృతితో తరుణ్ కుమార్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొత్త జీవితంపై ఎన్నో ఆశలతో విహరిస్తూ తీయటి కలలు కంటున్న ఆ జంటను మృత్యువు విడదీయడం పట్ల స్థానికులు విచారం వ్యక్తం చేశారు.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..