AP News | విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో జంట ఆత్మహత్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. నిమిషాల వ్యవధిలోనే గ్రామానికి చెందిన ఓ వివాహిత, యువకుడు బలవన్మరణానికి పాల్పడటం పలు అనుమానాలను రేకెత్తించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు మిస్టరీ ఆత్మహత్యలకు గల కారణాలను గుర్తించారు. అక్రమ సంబంధమే కారణమని తేల్చారు. ఇక ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో కనకల లక్ష్మి (30) అనే వివాహితకు మొకర ఆదిత్య (22) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. కొన్నాళ్లుగా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం కాస్తా కుటుంబ సభ్యులకు తెలియడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో కలిసి జీవించలేమని తెలుసుకున్న ఇద్దరూ అర్ధాంతరంగా తమ జీవితాలకు ముగింపు పలికారు. చనిపోవడానికి ముందు వీరి ఫోన్ రికార్డింగ్‌లు, ఛాటింగ్‌లు కీలకంగా మారాయి. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కలిసి జీవించడం సాధ్యం కాదని, తనువు చాలించడమే మేలని అనుకుని క్షణికావేశంలో ఆదిత్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఇక ఆదిత్య ఉరేసుకునే సమయంలో లక్ష్మికి వీడియోకాల్ చేయడంతో భయపడి ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతుల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read..
AP News | ఒకే ఊరిలో ఒకే టైమ్‌లో ఇద్దరి ఆత్మహత్య.. మిస్టరీగా మారిన వివాహిత, యువకుడి సూసైడ్
Vijayasai Reddy | మీతో ఆ విషయాన్ని పంచుకోవడానికి సంతోషిస్తున్నాను : విజయసాయి రెడ్డి
AP Nominated posts | ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు ఏమన్నారంటే ?