అమరావతి : ఏపీ రాజకీయాలు, సోషల్ మీడియాలో ఎప్పుడూ కీలకంగా ఉండే వైసీపీ ( YCP ) నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల రాజకీయాల ( Politics ) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన సరికొత్త జీవితాన్ని ప్రారంభించారు.
రాజ్యసభకు రాజీనామా ( Resign ) అనంతరం చేసిన ప్రకటన అనుగుణంగా తన భవిష్యత్‌ను మరల్చుకోవడానికి సాయి రెడ్డి చర్యలను ప్రారంభించారు. నా హార్టికల్చర్ (Horticulture) కార్యకలాపాలకు నేను సరికొత్త విధానాన్ని ప్రారంభించానని మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు తన కొత్త జీవితాన్ని పరిచయం చేస్తున్న ఫోటోలను షేర్ చేశారు.
I am happy to share that I have embarked on a fresh approach to my horticulture operations. pic.twitter.com/q2Gq5UNGgN
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025
దాదాపు మూడు దశాబ్దాల పాటు విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అనంతరం అతని కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనూ అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైసీపీ పాలనలో రెండుసార్లు రాజ్యసభకు ఎంపికయ్యారు.
తన పదవికాలం మరో మూడేళ్లపాటు ఉండగానే నాలుగు రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్లో చేసిన ప్రకటన సంచలనంగా మారింది. మరుసటి రోజే తన రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కడ్కు అందజేశారు. తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక తనకిష్టమైన హార్టికల్చర్ సాగువైపు దృష్టిని సారిస్తానని ప్రకటించారు.