విజయవాడ : (Corona Cases in AP) ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మళ్లీ పంజా విప్పుతున్నది. రోజూవారి పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 41,244 శాంపిల్స్ పరీక్షించగా.. 348 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. ముగ్గురు కోవిడ్ బాధితులు.. చిత్తూరు, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందినట్టు పేర్కొన్నారు. 358 మంది కొవిడ్ బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ఇవాల్టి పరీక్షలతో కలుపుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,98,46,690కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,69,066 కు పెరగ్గా.. ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 20,51,440 కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,220 గా ఉండగా.. మృతుల సంఖ్య 14,406కు పెరిగింది. తాజా కేసుల్లో అధికంగా తూర్పు గోదావరిలో 69, చిత్తూరులో 52 కేసులు వెలుగు చూశాయి.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..