నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 16 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి.
- పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
- పోలీసుల పటిష్ట బందోబస్తు
మంచిర్యాలటౌన్/చెన్నూర్/ చెన్నూర్టౌన్/బెల్లంపలి/దండేపల్లి/కాసిపేట/దహెగాం/రెబ్బెన/బెజ్జూర్ ఫిబ్రవరి 24 : మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు నిర్వహణకు అన్ని మండలాల్లోని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. మార్చి 16 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నారు. వీటిలో 10 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 6 ప్రభుత్వ రంగ జూనియర్ కాలేజీలు, ఏడు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాలు ఉన్న కాలేజీల్లో తరగతి గదుల వారీగా హాల్ టికెట్ నంబర్లను మంగళవారం లెక్చరర్లు టేబుళ్లపై రాసి ఉంచారు.
మంచిర్యాలలోని పరీక్షా కేంద్రాన్ని డీఐఈఓ అంజయ్య, పరీక్షల విభాగం అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో మొత్తం 12317 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా వారిలో ప్రథమ సంవత్సరం పరీక్షలు రాసేవారు 6260 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసేవారు 6057 మంది ఉన్నారు. 46 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, నలుగురు కస్టోడియన్లు, రెండు సిట్టింగ్ స్కాడ్ టీంలు, ఒక ఫ్లయింగ్ స్కాడ్ టీం ఏర్పాటుచేశారు. పరీక్షా కేంద్రాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జీరాక్స్ కేంద్రాలను మూసి ఉంచేలా చర్యలు చేపట్టారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

