(Fake CBI) కడప : సూర్య నటించిన గ్యాంగ్ సినిమాను తలపించేలా కడపలో నలుగురు యువకులు పోలీసుల అవతారం ఎత్తారు. అచ్చం పోలీసులను తలదన్నేలా ప్రవర్తిస్తూ అందినకాడికి దోచుకున్నారు. సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. బాగా డబ్బు ఉన్న వారిని టార్గెట్ చేస్తూ అచ్చం గ్యాంగ్ సినిమాలో మాదిరిగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
సీబీఐ అధికారులమంటూ చెప్పి ఈజీగా పెద్ద మనుషుల్ని బోల్తా కొట్టించవచ్చునని నలుగురు యువకులు ప్లాన్ చేశారు. గ్యాంగ్ సినిమాను పదేపదే చూసిన వీరు.. ఎలా మాట్లాడాలో కూడా ప్రాక్టీస్ చేశారు. గత నెల 23 న ఖాజీపేట మండలం కొత్తూరుకు చెందిన ఉదయ్‌కుమార్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఆయన ఇంటికెళ్లిన ఈ ముఠా సభ్యులు ఉదయ్‌కుమార్‌ను కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆస్తి వివరాలను కనుక్కొంటున్నట్లు నటించి కారులో పలు ప్రాంతాలకు తిప్పారు. చివరకు రూ.1.14 లక్షలను దండుకుని మరుసటి రోజు నిర్మానుష్య ప్రాంతంలో వదిలివెళ్లారు.
సీబీఐ పేరిట కొందరు తనను మోసం చేసింది గ్రహించిన ఉదయ్‌కుమార్.. చెన్నూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన చెన్నూర్ పోలీసులు.. సీబీఐ అధికారులమని చెప్తూ మోసం చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇద్దరు కడప జిల్లాకు చెందిన వారు కాగా, నెల్లూరు, అనంతపురానికి చెందిన ఒక్కో వ్యక్తి ఉన్నారు. వీరు గతంలో పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా పలువురు నిరుద్యోగులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి రూ.84 వేల నగదుతోపాటు కారును సీజ్ చేశారు. ఈ మోసగాళ్లు సీబీఐ అధికారులమని నమ్మించేందుకు ఐడీ కార్డులు కూడా తయారుచేసుకున్నారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..