కృష్ణా : ఆంధ్రప్రదేశ్లోని గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అనంతరం చికిత్స నిమిత్తం ఆమెను విజయవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..