కడప జిల్లాలో పేలుడు.. తొమ్మిది మంది కూలీల దుర్మరణం
కడప జిల్లాలో పేలుడు.. తొమ్మిది మంది కూలీల దుర్మరణం | కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురాళ్ల గనిలో పేలుడు సంభవించి పది మంది మరణించారు.

అమరావతి : కడప జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిలిటెన్‌స్టిక్స్ పేలిన ఘటనలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం కలసపాడు మండలం మామిళ్లపల్లె శివారులోని తిరుమల కొండ సమీపంలోని బైరటీస్ గనుల వద్ద చోటు చేసుకుంది. బద్వేలు నుంచి ముగ్గురాళ్ల గని కోసం తీసుకువచ్చారు. అన్లోన్ చేస్తుండగా ఒక్కసారిగా ప్రమాదవశాత్తు పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి మృతదేహాలు తునాతునకలై ఎగిరిపడ్డాయి. దీంతో మృతులను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. అలాగే వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. మృతులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం మృతులకు సంతాపం ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ప్రమాదం.. దంపతుల మృతి
భారత్‌కు ఆక్సిజన్ జనరేటర్లను మోసుకొస్తున్న అంటోనోవ్
చైనా సినోఫార్మ్ వ్యాక్సిన్‌కు WHO అనుమతి
మణిపూర్‌లో 24 గంటల కర్ఫ్యూ
తమిళనాడులో పూర్తిస్థాయి లాక్డౌన్
ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో అగ్ని ప్రమాదం
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Andhrapradesh
- blast
- Kadapa
- Killed
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
Allu Arjun | చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం రజినీకే సాధ్యం.. ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ ప్రశంసల జల్లు!
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

