(AP Polytechnics) అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న లెక్చరర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరి బదిలీ వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పాలిటెక్నిక్ అధ్యాపకుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఈ బదిలీకి దరఖాస్తు చేసుకోవాలనుకునే లెక్చరర్లు కనీసం రెండేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు, పక్షవాతంతో బాధపడుతున్న వారికి, జీవిత భాగస్వామి క్యాటగిరీ వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా, ఐదేండ్ల సర్వీసు పూర్తి చేసుకుని మరో 6 నెలల్లో పదవీ విరమణకు సిద్ధమైన ఉద్యోగుల బదిలీలపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇలాంటి వారిని బదిలీల ప్రక్రియ నుంచి తప్పించాలని పలువురు కోరుతున్నారు.
మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్
మన శరీరానికి ఎంత సీ విటమిన్ అవసరం? నిపుణులేమంటున్నారు..
జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 చిట్కాలు
శృంగార సామర్థ్యం ఉన్నా కోరికలు తగ్గిపోయాయా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..