అమరావతి : విజయవాడ ప్రకాశం బ్యారేజీకి(Prakasam Barrage) వరద కొనసాగుతుండటంతో ఇరిగేషన్ అధికారులు నాలుగు గేట్లను అడుగు మేర ఎత్తి 2,900 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఇసుక రీచ్‌లలో పని చేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్. రవికిరణ్ సూచించారు. కృష్ణా నదికి మరో మూడు, నాలుగు రోజులు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో దారుణం..భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్.. 2-0తో టర్కీని చిత్తు చేసిన ఆస్ట్రేలియా!
RGV | హైదరాబాద్‌ను కుదిపేసిన నేపాలీ గ్యాంగ్ హత్యకేసు.. ఆర్జీవీ తదుపరి సినిమా ఇదేనా?