కామారెడ్డి, ఆగస్టు 16: కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు.