FIFA 2026 | ఫిఫా వరల్డ్ కప్.. 2-0తో టర్కీని చిత్తు చేసిన ఆస్ట్రేలియా!
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా (Socceroos) జట్టు శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఓపెనింగ్ మ్యాచ్‌లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది.
FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా (Socceroos) జట్టు శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్-డి ఓపెనింగ్ మ్యాచ్‌లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా యువ ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన కౌంటర్ ఎటాకింగ్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ అద్భుత గోల్‌తో ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్‌కుందా సరికొత్త రికార్డు సృష్టించాడు.
ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్‌ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ బాక్స్ వెలుపల నుండి ఒక అద్భుతమైన లో-షాట్‌తో రెండో గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 22 ఏళ్ల యువ గోల్‌కీపర్ పాట్రిక్ బీచ్ అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కీ జట్టు చేసిన పలు ప్రమాదకరమైన గోల్ ప్రయత్నాలను సమర్థవంతంగా అడ్డుకుని క్లీన్ షీట్ సాధించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఈ ఘన విజయంతో ఆస్ట్రేలియా జట్టు గ్రూప్-డి లో 3 పాయింట్లతో టోర్నీని ఉత్సాహంగా ప్రారంభించింది. ప్రస్తుతం ఈ గ్రూప్‌లో పరాగ్వేపై 4-1తో గెలిచిన అమెరికా జట్టు అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండో స్థానంలో కొనసాగుతోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

