RGV | హైదరాబాద్‌ను కుదిపేసిన నేపాలీ గ్యాంగ్ హత్యకేసు.. ఆర్జీవీ తదుపరి సినిమా ఇదేనా?
RGV | హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న దారుణ హత్యలు, దోపిడీ ఘటనలు నగరవాసుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పనిమనుషులుగా, సహాయకులుగా చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించిన తర్వాత దారుణాలకు పాల్పడుతున్న కొన్ని గ్యాంగ్‌ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
RGV | హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్న దారుణ హత్యలు, దోపిడీ ఘటనలు నగరవాసుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇంటి పనిమనుషులుగా, సహాయకులుగా చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించిన తర్వాత దారుణాలకు పాల్పడుతున్న కొన్ని గ్యాంగ్‌ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజాగా జూబ్లీహిల్స్‌లో జరిగిన ఒక సంచలన హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా, ఈ ఘటన ఇప్పుడు సినీ పరిశ్రమ దృష్టినీ ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ కేసుపై ఆసక్తి చూపుతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నగరాన్ని కుదిపేసిన ఈ క్రైమ్ ఘటన ఆధారంగా ఆయన ఒక రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
వివరాల ప్రకారం, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే కుటుంబం జూబ్లీహిల్స్‌లో నివసిస్తోంది. ఆయన వైద్య చికిత్స నిమిత్తం బెంగళూరుకు వెళ్లిన సమయంలో ఇంట్లో భార్య తనూజ మరియు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. కుటుంబానికి సన్నిహితంగా, నమ్మకంగా పనిచేస్తున్న ఓ గృహ సహాయకురాలు ఈ పరిస్థితిని అవకాశంగా మార్చుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆమె బయట ఉన్న కొందరితో కలిసి కుట్ర పన్ని అర్ధరాత్రి సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించినట్లు తెలుస్తోంది. అనంతరం ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి హత్య చేసి, నగదు మరియు విలువైన ఆభరణాలను దోచుకుని పరారైనట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఘటన మరుసటి రోజు వెలుగులోకి రావడంతో నగరవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా నమ్మకమైన ఉద్యోగుల పేరుతో ఇళ్లలోకి చొరబడి నేరాలకు పాల్పడే ముఠాలపై ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందించడంలో ఆసక్తి చూపే వర్మ, ఈ కేసులోని కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకోవడం, ముందస్తు ప్రణాళికలు, క్రైమ్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలు వంటి అంశాలు ఆయనను ఆకర్షించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా తన పాత స్థాయి సినిమాలు తీయలేకపోతున్నానని స్వయంగా అంగీకరించిన రామ్ గోపాల్ వర్మ, మళ్లీ బలమైన కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని పలుమార్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు స్ఫూర్తిగా మారే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

