(Farmers Padayatra) ఒంగోలు : అమరావతి రాజధాని కోసం చేపడుతున్న రైతులు పాదయాత్ర ఇవాళ 14 వ రోజుకు చేరింది. పోలీసుల పహారా నడుమ యాత్ర కొనసాగుతున్నది. రైతుల యాత్రకు ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. యాత్రలో పాల్గొనేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నినాదాలు, డప్పు శబ్దాలు, కోలాటాల మధ్య పాదయాత్ర సందడిగా సాగింది. పోలీసుల ఆంక్షలు, నిర్బంధాల్నీ తోసిరాజని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు, మహిళలు తరలివచ్చి యాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు.
రాజధాని రైతుల మహాపాదయాత్రకు ఐకాస నేతలు శనివారం విరామం ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం నిడమనూరు గ్రామ పంచాయతీలో 12వ వార్డుకు ఈ నెల 14వ తేదీన ఉపఎన్నిక జరగనున్నది. ఫలితంగా పాదయాత్ర జరపరాదని ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈసీ ఆదేశాలను గౌరవిస్తూ పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించారు. 12వ రోజు పాదయాత్ర ప్రకాశం జిల్లా యరజర్ల శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆగింది. గురువారం నాడు పోలీసుల నిర్బంధాల కారణంగా పాదయాత్ర రణరంగంగా మారింది. పలువురు రైతులపై లాఠీలు విరిగాయి. ఒక రైతు చేయి విరిగింది. నిబంధనలకు లోబడి శాంతియుతంగా చేస్తున్న పాదయాత్రకు కొవిడ్ నిబంధనలు, ఎన్నికల కోడ్ అంటూ కావాలనే ఆంక్షలు సృష్టిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాదయాత్ర తిరిగి ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్నది.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..