Tirumala | తిరుమల (Tirumala) ఆలయ అధికారులపై తప్పుడు ప్రచారం చేసిన పలు యూట్యూబ్ ఛానళ్లపై (Youtube Channels) పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే తిరుమల ఆలయన సందర్శనకు వెళ్లారు. అయితే, ఆయనకు దర్శన ఏర్పాట్లు కల్పించడంలో టీటీడీ (TTD) అధికారులు విఫలమయ్యారంటూ ప్రచారం జరిగింది.
చాగంటికి వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని పలు యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి. ఇది కాస్తా తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టికి వెళ్లింది. దీనిపై అధికారులు సీరియస్ అయ్యారు. ఈ మేరకు ఆయా యూట్యూబ్ ఛానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read..
Tirumala | తిరుమలలో టోకెన్లు ఉన్న భక్తులకు నేరుగా దర్శనం
Nandigam Suresh | నందిగం సురేశ్‌కు బెయిల్.. 145 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల
AP News | అక్రమసంబంధమే కారణం.. వివాహిత, యువకుడి ఆత్మహత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు