(Local Body elections) విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిన స్థానిక సంస్థలకు ఈ నెల 14, 15, 16 తేదీల్లో పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో తెరపడింది. హోరాహోరీగా కొనసాగిన ప్రచారం నేటితో ముగిసింది. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇక్కడ టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈనెల 15న పోలింగ్, 17న కౌంటింగ్ చేపట్టాలన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన 13 చోట్ల ఆదివారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. నెల్లూరు కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలకు ఈ నెల 3న నోటిఫికేషన్ విడుదలైంది.
నెల్లూరు నగర కార్పొరేషన్ 54 డివిజన్లలో 8 ఏకగ్రీవం కాగా మిగతా 46 చోట్ల వైసీపీ, టీడీపీతో పాటూ జనసేన, కొన్ని చోట్ల వామపక్షాల అభ్యర్థులు బరిలో ఉన్నారు. అధికార పార్టీతో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహించారు. మరో రెండు రోజుల్లో పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు, వివిధ పార్టీల నేతలు బిజీ అయిపోయారు. పెనుకొండతో పాటు అనంతపురంలోని 17వ డివిజన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి.
14న పలు పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజుల సాయంత్రానికి ఫలితాలు వెలువడనున్నాయి. మొత్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలి పోయిన 498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌లకు ఎన్నిక జరుగుతుండగా, మిగిలిపోయిన 533 వార్డు సభ్యలకు కూడా ఎన్నిక జరగనున్నది. ఈ నెల 16న మిగిలిపోయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18న కౌంటింగ్ నిర్వహిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయి.
చరిత్రలో ఈ రోజు : ఫ్రాన్స్‌లో ఉగ్రవాద దాడులకు ఆరేండ్లు..
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ టైంకే పడుకోవాలి.. ఇంగ్లిష్ పరిశోధకులు
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..