(PUBG game) అనంతపురం : ఆన్లైన్ గేమ్‌లంటే టీనేజర్లతో పాటు పిల్లలు కూడా అమితంగా ఇష్టపడుతున్నారు. కొందరు గేమ్‌కు బానిసలుగా మారి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అదేపనిగా పబ్జీ గేమ్ ఆట ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు అనంతపురం జిల్లాకు చెందిన సుబ్బరాయుడు అనే 8వ తరగతి విద్యార్థి. ప్రస్తుతం నరాలు చిట్లిపోయి అపస్మారక స్థితిలో ఉన్న సుబ్బరాయుడు.. స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.
పెద్దవడుగూరు మండలానికి సుబ్బారాయుడు కొంతకాలంగా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. పబ్-జి గేమ్‌కు బానిసగా మారాడు. నిరంతరం ఆటలోనే నిమగ్నమై ఉండేవాడు. ఇలా దాదాపు 3 నెలలుగా ఇల్లు, స్నేహితులను మరిచిపోయి ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఇంటి వద్దే స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు స్థానిక దవాఖానకు తరలించారు. బాలుడు తన తల్లిదండ్రులను కూడా గుర్తించలేకపోతున్నాడు. దాంతో బాలుడుని చికిత్స నిమిత్తం కర్నూలులోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. కుమారుడి పరిస్థితి చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పబ్జీ గేమ్‌కు అలవాటు పడటంతో తల భాగంలో నరాలు చిట్లి అపస్మారక స్థితిలోకి వెళ్లాడని, కోలుకోవడానికి కొంత టైం పడుతుందని వైద్యులు చెప్పినట్లు బంధువులు తెలిపారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..