(K Ramakrishna) అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రెండు రోజులు ఢిల్లీలో మకాం వేసిన జగన్.. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్‌తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపాలంటూ విజ్ఞప్తి చేశారు.
కాగా, సీఎం జగన్ తన ఢిల్లీ టూర్‌పై వాస్తవాలను బయటపెట్టాలని, పర్యటన వివరాలను ప్రజలకు చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ప్రధానితో ఎప్పుడు కలిసినా ప్రత్యేక హోదా అంటారే గానీ.. కొత్త విషయాలు ఏవీ ప్రస్తావించడం లేదని అన్నారు. ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంలో ఏయే అంశాలు విన్నవించారో బయటకు రానివ్వరని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. ఇవాళ రాజమండ్రిలోని గైట్ కాలేజీలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య నిర్వహించిన సదస్సులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు కోత పెట్టారని, రూ.55 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టుకు బకాయిలు వున్నాయని జగన్ చెప్తున్నారని అన్నారు. విభజన హామీలు లేవు, నిధులు లేవు అయినా ఎందుకు నిలదీయడం లేదో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్నికి కేంద్రం అన్యాయం చేస్తుంటే ఎందుకు పోరాటం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇకనైనా గొంతెత్తకపోతే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమన్నారు.
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..