విజయవాడ : (CM Jagan Review) వైద్యారోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిపారు. వైద్య ఆరోగ్య శాఖతోపాటు నాడు–నేడు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, కంటి వెలుగుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలపై అధికారులను వివరాలు అడిగి తెలసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. మెడికల్ కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణాలను నిర్ధిష్ట కాలంలో పూర్తి చేయాలన్నారు. కంటివెలుగు కార్యక్రమాన్ని మరింత సమర్థంగా నిర్వహించాలన్న సీఎం.. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా 10,011 వైయస్సార్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం పనులు చేపట్టాలని నిర్ణయించగా.. ఇప్పటికే 8,585 చోట్ల పనులు మొదలయినట్టు అధికారులు సీఎం జగన్కు తెలిపారు. ఆరోగ్య కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు వివరించారు. డిసెంబర్ కల్లా మరమ్మతు పనులు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అవసరమైన చోట 146 కొత్త భవనాల నిర్మాణం మార్చి 2022 నాటికి పూర్తిచేస్తామని సీఎం జగన్కు అధికారులు చెప్పారు. సీహెచ్సీల్లో, ఏరియా దవాఖానల్లో నాడు–నేడు పను లు చురుకుగా సాగుతున్నాయని, అత్యవసర పనులను ఇప్పటికే పూర్తి చేశామని అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..