(Chengala Venkatrao) విశాఖపట్నం: టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగాను చంపించిన చంద్రబాబే.. ఇప్పుడు వంగవీటి రాధాను కూడా చంపించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల రాధా ఇంటి వద్ద రెక్కీ చంద్రబాబు కుట్రలో భాగమేనని అనుమానించాల్సి వస్తున్నదని అన్నారు. రాధాను హతమార్చి కాపుల ఓట్లతో సీఎం అవ్వాలని చంద్రబాబు ఉవ్వీళ్లూరుతున్నారని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదే సమయంలో తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై కూడా చెంగల వెంకట్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థాయిని మించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తండ్రి వయసున్న సజ్జల రామకృష్ణారెడ్డికి కత్తెర చూపిస్తూ చేసిన వ్యాఖ్యలను అనిత వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల కష్టపడి ఈ స్థాయికి ఎదిగారే కానీ, నీ మాదిరిగా భర్తను చెప్పుతో కొట్టించి జైలుకు పంపలేదని అన్నారు.
ఏలేరు కాలువలో జరిగిన అవకతవకలు బయటపడటంతో జైలుకెళ్లాల్సి వస్తుందని ముందస్తుగా స్టే తెచ్చుకున్నది అనిత మర్చిపోయిందేమో.. గుర్తుచేస్తున్నానన్నారు. టీచర్‌గా పనిచేసిన అనిత.. పాయకరావుపేట ఎమ్మెల్యే స్థాయికి ఎలా ఎదిగిందో నియోజకవర్గం ప్రజలను అడిగితే చెప్తారని చెంగల వెంకట్రావు అన్నారు.
యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి
ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ డైట్.. దీని ప్రత్యేకత ఏంటంటే..?!
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..