మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 23 : జర్నలిస్టులు, డెస్క్ జర్నలిస్టులకు గొడ్డలిపెట్టులా మారిన 252 జీవో ను రద్దు చేస్తూ పాత జీవో ప్రకారమే అక్రిడిటేషన్ కార్డు లు ఇవ్వాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు ప్రెస్‌క్లబ్, డెస్క్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నరేంద్రాచారి, డీజేఏ గౌరవ అధ్యక్షుడు తిరుపతయ్యలు మాట్లాడుతూ ప్రతినిత్యం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి ఎప్పటికప్పుడు వార్తల రూపంలో చేరవేస్తున్న జరల్నిస్టులకు ప్రభుత్వం ఇచ్చే అక్రిడిటేషన్లలో కోతలు విధించడం దారుణం అన్నారు. గతంలో ఎడిషన్ కేంద్రాలు ఉన్న దగ్గర డెస్క్‌లకు ఎనిమిది, రిపోర్టర్లకు ఆరు, జిల్లా కేంద్రాల్లో డెస్క్‌లకు ఐదు, రిపోర్టర్లకు మూడు, నియోజకవర్గ కేంద్రాలకు అదనంగా ఒకటి చొప్పున అక్రిడిటేషన్లు ఇచ్చే వారని ప్రస్తుతం జీవో నెంబర్ 252 ప్రకా రం ఎడిషన్ కేంద్రాల్లోని డెస్క్‌లకు నాలుగుకు కుదించడంతోపాటు జిల్లా కేంద్రాల్లో సబ్ఎడిటర్లు, రిపోర్టలకు ఇచ్చే అక్రిడిటేషన్లు అన్ని కుదించడంతో జిల్లా కేం ద్రాల్లోని జర్నలిస్టులకు, డెస్క్ జర్నలిస్టులకు తీవ్ర అ న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్ర భుత్వం వెంటనే ఈ జీవోను రద్దు చేసి పాత జీవో ప్ర కారంగానే అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అవసరమైతే ఐఅండ్‌పీఆర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి కలెక్టర్ విజయేందిర బోయిని, డీపీఆర్వో శ్రీనివాస్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ కార్యదర్శి నరేందర్‌గౌడ్, సహాయ కార్యదర్శి సతీశ్‌కుమార్, ఎడిషన్ ఇన్చార్జీలు నరేశ్, హరిప్రసాద్, వివిధ పత్రికల బ్యూరో ఇన్చార్జీలు వెంకటేశ్వర్రావు, రవీందర్‌రెడ్డి, కిశోర్‌కుమార్, ధరణీకాంత్, శివకుమార్, టీయూడబ్ల్యూజేఎఫ్ నాయకులు గోపాల్, డీజేఏ జిల్లా అధ్యక్షుడు కే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డీజేఏ నాయకులు సాయికుమార్, శ్రీనివాస్‌యాదవ్, జమ్మన్న, వెంకటేశ్, ఏ విష్ణు, కుర్మయ్య, నవీన్, చక్రవర్తి, శివకుమార్‌తోపాటు వివిధ పత్రికల రిపోర్టర్లు మోహన్‌దాస్, నాగరాజు, శ్రీనివాస్, వెంకటరమణ, షాషా ఉన్నారు.