శ్రీవిష్ణు టాప్5 మూవీస్‌లో ‘విష్ణు విన్యాసం’
‘ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో.. చూసుకున్నాక అంతకుమించి ఎంజాయ్ చేశాం. డైలాగ్స్‌ని శ్రీవిష్ణు స్పాట్లో ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అవన్నీ ఇందులో ఆడియన్స్‌ని అలరిస్తాయి’ అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు.జి, సుమంత్‌నాయుడు.జి అన్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా వారు నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’.
‘ఈ కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో.. చూసుకున్నాక అంతకుమించి ఎంజాయ్ చేశాం. డైలాగ్స్‌ని శ్రీవిష్ణు స్పాట్లో ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అవన్నీ ఇందులో ఆడియన్స్‌ని అలరిస్తాయి’ అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు.జి, సుమంత్‌నాయుడు.జి అన్నారు. శ్రీవిష్ణు కథానాయకుడిగా వారు నిర్మించిన కామెడీ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’. నయనసారిక కథానాయిక. యదునాథ్ మారుతీరావు దర్శకుడు. ఈ నెల 27న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలిద్దరూ సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ‘ఇందులో హీరో పేరు విష్ణు. న్యూమరాలజీ అంటే తనకు అమితమైన నమ్మకం. ఈ పాత్ర చుట్టూనే కథ నడుస్తుంది. దానితోపాటు మరో ఆసక్తికరమైన ట్రాక్ కూడా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే హీరోహీరోయిన్ల ఫ్యామిలీ ట్రాక్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కథలోనే కామెడీ వుంటుంది. అందుకే ఎక్కడా ఫోర్స్‌గా అనిపించదు. కథలో ప్రాధాన్యత ఉన్న పాత్రను నయనసారిక పోషించారు.
ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యే సినిమా ఇది.’ అని నిర్మాతలు సుబ్రహ్మణ్యం నాయుడు, సుమంత్ నాయుడు చెప్పారు. శ్రీవిష్ణు కెరీర్‌లోని టాప్ 5 మూవీస్‌లో ‘విష్ణు విన్యాసం’ ఒకటిగా నిలుస్తుందని, సంగీత దర్శకుడు రథన్ తన పాటలతో, నేపథ్య సంగీతంతో సినిమాకు అందాన్ని తెచ్చారని నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయని, వాటి వివరాలు త్వరలో తెలియజేస్తామని వారన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

