(Wig Cheating) బట్టతలను విగ్గుతో కప్పిపెట్టి అమ్మాయిలకు కుచ్చుటోపీ పెట్టడం ఇతగాడి ప్రవృత్తి. బిల్డర్‌గా బిల్డప్.. ఎన్నారైగా కలరింగ్ ఇస్తుంటాడు. మాయ మాటలు చెప్పి అమ్మాయిలకు వల వేసి అందినకాడికి దోచుకుంటాడు. ఇలా ఇతగాడి మాటలు నమ్మి పదుల సంఖ్యలో అమ్మాయిలు మోసపోయారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కాగా.. తెలంగాణలో కూడా పలువురిని మోసం చేసినట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెప్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంకు చెందిన విగ్గు మాస్టర్ రఫీ. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళల్ని పరిచయం చేసుకుని బిల్డర్‌గా బిల్డప్ ఇస్తుంటాడు. ఇతగాడి మాటలు నమ్మగానే వారితో సహజీవనం చేస్తూ హ్యాండిస్తుంటాడు. ఇటీవలనే ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ విగ్గు మాస్టర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. రఫీ వేధింపులు భరించలేక భార్య, పిల్లలు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. పాలిటెక్నిక్ మధ్యలో ఆపేసి బిల్డర్ అవతారం ఎత్తాడు. కార్తీక్ వర్మ అనే పేరుతో హైదరాబాద్‌లో పరిచయం చేసుకుని ఒకరితర్వాత ఒకర్ని మోసం చేయటమే పనిగా పెట్టుకున్నాడు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు బట్టతల బాబుని అరెస్ట్ చేసి సెల్లో పడేశారు.
తనతో ఉన్నప్పుడు తీసిన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో బయటకు చెప్పుకోలేని అమ్మాయిలు ఈయన అడగినంత ముట్టజెప్పుకున్నట్లు తెలుస్తున్నది. కూకట్‌పల్లిలో ఓ అమ్మాయిని మోసం చేయడంతో ఆ యువతి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఇతగాడి బండారం అంతా బయటపడింది. రఫీ అలియాస్ కార్తీక్ వర్మపై పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేయగా అతని వలలో పడి 20 మంది అమ్మాయిలు మోసపోయారని తేలిందని పోలీసులు తెలిపారు.
ఈ పట్టు వస్త్రం.. గాలి కంటే చల్లగా ఉంచుతుంది.. చైనా శాస్త్రవేత్తల సృష్టి
డైట్ డ్రింక్స్ తాగుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి! ఇది మీ కోసమే..
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? న్యుమోనియా కావచ్చు !
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..