కొత్తగూడెం ప్రగతి మైదాన్ : 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన కొత్తగూడెం క్రీడాకారులను మంగళవారం ప్రకాశం స్టేడియంలోని కొత్తగూడెం సెంటర్లో ఘనంగా సత్కరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు మెడల్స్‌తో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ కె.సారంగపాణి, అంతర్జాతీయ అథ్లెటిక్స్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్, జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రెటరీ కె.మహీధర్, జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామ రెడ్డి క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన క్రీడాకారుల ప్రతిభను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు. క్రీడాకారులను తీర్చిదిద్దడంలో నిరంతరం కృషి చేసిన కోచ్ డి.మల్లికార్జున్ రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి మురళి, ప్రిన్సిపాల్ చిన్నప్ప, సెయింట్ ఆండ్రూస్ హైస్కూల్ హెచ్ఎం రాజు, అడ్వకేట్ మరపాక రమేశ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, పీఈటీలు, సింగరేణి ఉద్యోగులు తదితరులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు.