The Paradise | నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కిన సంచలన చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్ కావడంతో చిత్ర బృందం మొక్కులు తీర్చుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా తాజాగా హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు జిల్లాలోని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు.
మేడారం వెళ్లేముందు మొదట గట్టమ్మను దర్శించుకున్న నాని అనంతరం మేడారం బయలుదేరారు. ఇక అమ్మవార్ల సన్నిధికి చేరుకున్న నాని, శ్రీకాంత్, చిత్రబృందం వనదేవతలకు తమ బరువుకు తూగలా నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. మేడారంలో నాని, శ్రీకాంత్ ఓదెల పర్యటనకు సంబంధించిన విజువల్స్ మరియు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
మేడారం లో నిలువెత్తు బంగారం తో మొక్కు తీర్చుకున్న నాని, శ్రీకాంత్ ఓదెల.#TheParadise #Nani #SrikanthOdela pic.twitter.com/E0pwjEIb81
— Telangana Box Office (@Telangana_BO) September 29, 2026