హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం (KRMB Meeting ) వాయిదా పడింది. అక్టోబర్ 1న తెలంగాణ ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ రోజున జరుగవలసిన కేఆర్ఎంబీ 21వ సమావేశాన్ని వాయిదా వేసినట్లు బోర్డు సభ్యుడు, సెక్రటరీ సతీష్ కంబోజ్ ( Satish Kamboj ) తెలిపారు.
ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ సెక్రటరీ, ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశముండడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్లు వివరించారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేంది ఏపీ, తెలంగాణ ప్రభుత్వ అధికారుల ఉమ్మడి నిర్ణయం మేరకు సమావేశపు తేదిని వెల్లడిస్తామని తెలిపారు.