శ్రీశైలం : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) రేపు శ్రీశైలం (Srisailam ) ఆలయాన్ని దర్శించుకోనున్నారు. గురువారం సత్యసాయి జిల్లాలో పింఛన్ల పంపిణీ అనంతరం హెలికాప్టర్లో శ్రీశైలానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా పోలీసులు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా(Sp Adiraj Singh) సీఎం పర్యటించే ప్రదేశాలను బుధవారం స్వయంగా పరిశీలించారు. భద్రత చర్యల గురించి సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ముఖ్యమంత్రి శ్రీశైలం చేరుకున్నప్పటినుంచి తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 1100 మంది పోలీస్ సిబ్బంది, అధికారులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ వెల్లడించారు. సీఎం పర్యటించే ప్రదేశాలను 11 సెక్టర్లుగా విభజించి ప్రతి సెక్టార్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని, ఆపై డీఎస్పీ స్థాయి అధికారులు నియమించామని వివరించారు.
సీఎం రాక సందర్భంగా హెలిప్యాడ్ నుంచి శ్రీశైలం ముఖద్వారం, హఠకేశ్వరం, సాక్షిగణపతి, నందిసర్కిల్,వీవీఐపీ అతిథి గృహ పరిసర ప్రాంతాలు, కొత్తపేట, సుండిపెంట స్విచ్ యాడ్ లింగాల గట్టు , ఆనకట్ట మొదలగు ప్రాంతాల్లో గ్రేహౌండ్స్ , స్పెషల్ పార్టీ బలగాలతో బందోబస్తు చర్యలు తీసుకున్నామని ఎస్పీ తెలిపారు.
AP Cabinet | ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా