అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరుగవలసిన సమావేశం వివిధ ప్రభుత్వ కార్యాక్రమాల వల్ల వాయిదా వేశారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు పింఛన్ల (Pensions) పంపిణీ కార్యక్రమం ఉండడంతో సమావేశాన్ని వాయిదా వేసుకున్నారు.
పింఛన్ల పంపిణీని పండుగ వాతావరణంలోఅన్ని నియోజకవర్గాలు, గ్రామాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో భాగంగా మంత్రులు కూడా పంపిణీలో పాల్గొననున్న దృష్ట్యా ఈ మంత్రి వర్గ సమావేశాన్ని వారం చివరల్లో నిర్వహించనున్నారు.
గత ఎన్నికల్లో ప్రజలకు కూటమి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆర్టీసీ బస్సు (RTC) లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇళ్ల పంపిణీ తదితర హామీలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించాల్సిన అంశాలను, ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ (Neerabh Kumar Prasad) ఆదేశాలు జారీ చేశారు.
YS Sharmila | అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.. కేంద్రమంత్రి పెమ్మసానితో షర్మిల ట్విట్టర్ వార్!