(Chain Snachers arrest) గుంటూరు : చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠానొకదాన్ని గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా గత కొంతకాలంగా వరుస స్నాచింగ్లకు పాల్పడుతూ గుంటూరు వాసులకు నిద్ర కరవయ్యేలా చేస్తున్నది. వీరిని పట్టుకునేందుకు గుంటూరు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ప్రజలు ఊపిరితీసుకునేలా చేశారు.
గుంటూరులో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ప్రత్యేక పోలీసు బృందం పట్టుకుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించి పట్టుకున్నారు. దొంగిలించిన వస్తువులు కొన్న వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. వీరి నుంచి 2 బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 1.35 లక్షల వరకు ఉంటుందని గుంటూరు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో ఇటీవల ఓ 90 ఏండ్ల వృద్ధురాలు మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారైన వ్యక్తి కూడా ఉన్నాడు. ఈ ముద్దాయిపై ఇప్పటికే 8 కేసులు ఉన్నాయి. దొంగిలించిన బంగారు గొలుసును లాడ్జి లాకర్లో భద్రపరిచినట్లు పోలీసులు గుర్తించారు.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..