అమరావతి : ఏపీలో కూడా కులగణన (Caste census) చేపట్టాలని కాంగ్రెస్ కమిటీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని ట్విటర్లో కోరారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలన్నారు.
రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలని, జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని పేర్కొన్నారు . గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా, బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ (YS Jagan) ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టి, బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని విమర్శించారు. బీజేపీ ( BJP ) డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే, రిజర్వేషన్లు రద్దుకు కుట్ర పన్నుతుందని బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని, వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
More Read |
RK Roja | తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓటమి : మాజీ మంత్రి రోజా
TDP | ఉద్రిక్తల మధ్య కొనసాగిన ఎన్నిక.. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం