TDP | ఉద్రిక్తల మధ్య కొనసాగిన ఎన్నిక.. తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి టీడీపీ కైవసం
TDP | ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు (Munikrishna) 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
అమరావతి : ఎంతో ఉత్కంఠ మధ్య కొనసాగిన తిరుపతి (Tirupati ) కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ (Deputy Mayor) పదవిని ఎన్డీయేలోని టీడీపీ(TDP) కైవసం చేసుకుంది. కోరం లేక నిన్న వాయిదా పడిన ఎన్నికను మంగళవారం తిరుపతి ఎస్వీ వర్సిటీ సెనెట్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ, కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొనగా ఎన్డీయే అభ్యర్థి, టీడీపీ కార్పొరేటర్ మునికృష్ణ విజయం సాధించారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లుండగా 47 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వీటిలో 3 ఖాళీలున్నాయి. డిప్యూటీ మేయర్ ఎన్నికకు 26 మంది కావాల్సి ఉండగా తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, తన 21 మంది వైసీపీ కార్పొరేటర్లు హాజరై డిప్యూటీ మేయర్ పదవికి వైసీపీ అభ్యర్థిగా భాస్కర్ రెడ్డిని పోటీ చేయించారు. అయితే టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు (Munikrishna) 26 మంది కార్పొరేటర్లు, వైసీపీ అభ్యర్థికి 21 ఓట్లు రావడంతో డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
కోర్టు ఆదేశాలతో గట్టి పోలీసు బందోబస్తు
డిప్యూటీ మేయర్ ఎన్నికలో అధికార కూటమి ప్రభుత్వం దౌర్జన్యాలకు పాల్పడవచ్చనే అనుమానంతో వైసీపీ నాయకులు ముందస్తుగా భద్రత కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఎన్నికల కేంద్రం వద్ద అదనపు భద్రత కల్పించారు. ఈ సందర్భంగా తిరుపతిలో144 సెక్షన్ అమలు చేస్తూ 30 పోలీసు యాక్టును అమలు చేసినట్లు ఎస్పీ హర్షవర్దన్‌రాజు తెలిపారు. గొడవలు సృష్టించేవారికి నోటీసులు అందజేశామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

