Papikondalu : రేపటి నుంచి పాపికొండలకు బోటు సర్వీసులు
Papikondalu : పాపికొండల్లో విహరించుకోవాలనుకునే పర్యాటకులకు శుభవార్త. రేపటి నుంచి పాపికొండలకు బోట్ యాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..

విజయవాడ : (Papikondalu) పాపికొండల్లో విహరించుకోవాలనుకునే పర్యాటకులకు శుభవార్త. రేపటి నుంచి పాపికొండలకు బోట్ యాత్రను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాపికొండలకు బోట్ సౌకర్యాన్ని ఆదివారం నుంచి పునఃప్రారంభిస్తన్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. రేపటినుంచి బోటు సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇవాళ గండి పోచమ్మ ఆలయం బోట్ పోయింట్ వద్ద ట్రయిల్ రన్ నిర్వహించారు. కచ్చులూరు బోటు ప్రమాదం జరిగిన దాదాపు రెండేండ్ల అనంతరం ఈ యాత్ర పునఃప్రారంభం కానున్నది. ఈ మేరకు ప్రభుత్వం గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో 9 కమాండ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది.
పాపికొండలకు బోట్ సర్వీసుల ప్రారంభంపై శనివారం రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో టూరిజం, పోలీసులు అధికారులతో జిల్లా కలెక్టర్ హరికిరణ్ సమావేశం నిర్వహించారు. బోట్ ఆపరేటర్లు ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాత్రికుల భద్రత, బోట్ టూర్ ఆపరేటర్లు, ఫెర్రీ ఆపరేటర్లు పాటించవలసిన నిబంధనల గురించి కలెక్టర్ వివరించారు. తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని.. కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.
రాజమండ్రి నుంచి పాపికొండలు వెళ్లే ఒక్కో ప్రయాణికుడికి రవాణా, భోజన వసతితో కలపి టికెట్ ధరను రూ.1,250 గా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. పాపికొండల సర్వీసులతో పాటు భవానీ ద్వీపం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కూడా బోట్లు నడపనున్నట్టు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) డైరెక్టర్ ఎస్ సత్యనారాయణ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
బాలికపై గ్రామ వాలంటీర్ల సామూహిక లైంగికదాడి
పెట్రోల్, డీజిల్ ధరలపై జాతీయ స్థాయిలో చర్చించాలి : ఎంపీ మోపిదేవి
తక్కువ నిద్రతో మందగించనున్న ఆలోచనా శక్తి
ఈ పండ్లను కలిపి తింటున్నారా? అయితే, ఒక్కసారి ఇది చదవండి!
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

