(Murder @ Chittoor) చిత్తూరు : నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఏపీ టూరిజం శాఖ ఉద్యోగి.. శవమై తేలాడు. ఆయన మృతదేహాన్ని బాకరాపేట ఘాట్ సమీపంలోని అడవిలో గుర్తించారు. అప్పు తీసుకున్న వ్యక్తులు ముగ్గురు కలిసి రాడ్లతో కొట్టి చంపారు. మృతుడి బైక్ స్థానిక రాయల్ నగర్లో పోలీసులు గుర్తించారు. డిసెంబర్ 31 నుంచి తన తండ్రి కనిపించకుండా పోయాడని ఆయన కుమారుడు రూపేష్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ అనుమానస్థుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. డొంకంతా కదిలింది.
తిరుపతి వెస్ట్ డీఎస్పీ నర్సప్ప కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్లో సూపర్వైజర్గా తిరుపతి ఎల్బీనగర్లో నివాసముండే చంద్రశేఖర్ (53) పనిచేస్తున్నాడు. డిసెంబర్ 31 న ఆయన కుమారుడు రూపేష్ కుమార్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దాంతో తన తండ్రి అదృశ్యమయ్యాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కుటుంబ సభ్యులు ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయగా.. తిరుచానూరు కృష్ణశాస్త్రినగర్‌కు చెందిన రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
అప్పుగా తీసుకున్న మొత్తానికి అధికంగా వడ్డీ వసూలు చేస్తుండటంతో చంద్రశేఖర్‌పై ముగ్గురు వ్యక్తులు కోపంతో ఉన్నారు. చంద్రశేఖర్‌కు వ్యాపారి మధుబాబు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.14.50 లక్షలు బాకీ పడ్డాడు. డబ్బు తిరిగి ఇవ్వాలని చంద్రశేఖర్ ఒత్తిడి చేయడంతో దామినీడు చంద్రగిరికి చెందిన పురుషోత్తంతోపాటు మధుబాబు, రాజులు.. చంద్రశేఖర్‌ను అంతం చేయాలని పథకం వేశారు. డబ్బులు ఇస్తానని పెద్దకాపు లేఅవుట్‌కు రావాలని చంద్రశేఖర్‌కు ఫోన్ చేశారు. అక్కడికి రాగానే ముగ్గురూ ఇనుప రాడ్లతో తలపై బలంగా కొట్టడంతో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్లాస్టర్‌తో చుట్టి శవపేటికలో ఉంచి బాకరాపేట ఘాట్ అడవిలో పడేశారు. నిందితుడు పురుషోత్తం పరారీలో ఉన్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు పంపారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
చాతిలో నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ సమస్యా? గుండెనొప్పా?
కళ్లు పొడిబారుతున్నాయా..? తస్మాత్ జాగ్రత్త!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
మీ జీవితభాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
చర్మంపై దద్దుర్లు, దురద ఉంటే.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..