Murder | హైదరాబాద్ : న్యూ ఇయర్ వేడుకల వేళ గోవాలో దారుణం జరిగింది. కొత్త సంవత్సరం వేడుకలకు గోవా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. న్యూ ఇయర్ వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుంచి ఓ ఎనిమిది మంది యువకులు గోవా వెళ్లారు. డిసెంబర్ 29వ తేదీన అర్ధరాత్రి గోవాలోని ఓ రెస్టారెంట్లో 8 మంది దిగారు. 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో వీరికి.. రెస్టారెంట్ సిబ్బందికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫుడ్ రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై రెస్టారెంట్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రవితేజ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా రవితేజ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై రవితేజ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
షాకింగ్ వీడియో
న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపిన రెస్టారెంట్ మాఫియా
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లిన ఎనిమిది మంది స్నేహితుల బృందం
డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు… https://t.co/S53LcnZdzo pic.twitter.com/roTqRraruS
— Telugu Scribe (@TeluguScribe) January 2, 2025
ఇవి కూడా చదవండి..
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్రంలో పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
MLC Varudu Kalyani | చంద్రబాబు అన్ని వర్గాలకు మోసం : వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
AP High Court | వైసీపీ నాయకుడు బోరుగడ్డ అనిల్‌కు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు