అమరావతి : ఏపీ కేబినెట్ (AP Cabinet) సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandra Babu) అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా14 అంశాలపై చర్చ జరుగగా అన్నింటికీ ఆమోదం వ్యక్తం చేసింది.
ముఖ్యంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహకాల బోర్టు (State Investment Promotion Board ) తెలిపిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల వల్ల 2,63,411 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశముందని వెల్లడించింది . అమరావతిలో రూ. 2,733 కోట్ల పనులకు, రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి, కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
నంద్యాల, కడప, కర్నూల్ జిల్లాలో పవన, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు.. రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేసే 500 పీబీజీ ప్లాంట్లకు మంత్రివర్గం ఓకే చెప్పింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న రెండు పనులకు మంత్రివర్గం ఆమోదించింది. మున్సిపల్ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు, భవన నిర్మాణాలు, లేఔట్ల అనుమతుల జారీ అధికారాన్ని మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్టసవరణకు అనుమతి ఇచ్చింది.
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటు
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఉన్న 50 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని వంద పడకలు, గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణానికి ఏపీ కేబినెట్ సమ్మతించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, రామ్మోహన్, నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు.