అమరావతి : ఏపీలో వైసీపీ నాయకుడు, బోరుగడ్డ అనిల్‌కు (Borugadda Anil) కోర్టులో మరోసారి చుక్కెదురయింది. సోషల్ మీడియాలో (Social Media) అసభ్యకరంగా పోస్టులు చేసినందుకు గాను పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించగా బోరుగడ్డ అనిల్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ఏపీ హైకోర్టు (AP High Court) గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కేసును పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులే పనిగా పెట్టుకున్నారా అంటూ ప్రశ్నిస్తూ , అసభ్యకర పోస్టులు పెట్టే ఇలాంటి వారిని క్షమించడానికి వీల్లేదని వ్యాఖ్యనించింది. ఈ సందర్భంగా పిటిషనర్‌కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అనుచిత పోస్టుల వ్యవహారంలో ఛార్జిషీట్ దాఖలైందని పేర్కొన్నారు.