(No night curfew) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతున్నది. థర్డ్ వేవ్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటున్నదని ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని పొరుగున ఉన్న తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తాజాగా, ఆంధ్రప్రదేశ్ సైతం నైట్ కర్ఫ్యూ అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించిందనే ప్రచారాలు కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ విధించ లేదని స్పష్టంచేసింది.
ఇవాల్టి నుంచే కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయని, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు జగన్ సర్కారు ప్రకటించినట్లుగా పలు ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో ఎటువంటి నైట్ కర్ఫ్యూ విధించ లేదని అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఇలాంటి తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారని, ఇలాంటి వారి గురించి ఆరా తీస్తున్నట్లు అధికారులు తెలిపారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప.. ఇటువంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని అధికారులు ప్రజలకు సూచించారు. కాగా, కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తినాల్సిందే!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
ఇప్పటిదాకా కరోనా.. ఇప్పుడు ఫ్లొరోనా! దీని లక్షణాలు ఏంటి?.. ఎంత ప్రమాదకరం?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..