కాలువ నిర్మాణం కోసం రైతుల భిక్షాటన
రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం 6 కెనాల్ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పన్నెండు గ్రామాల రైతులు వినూత్న నిరసన తెలిపారు.
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 25 : రంగనాయకసాగర్ ఆర్డీ3 ఎల్ఎం 6 కెనాల్ నిర్మాణం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పన్నెండు గ్రామాల రైతులు వినూత్న నిరసన తెలిపారు. పెద్దలింగాపూర్ శివారులో 16 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో బుధవారం జిల్లా కేంద్రంతోపాటు ఇల్లంతకుంటలో భిక్షాటన చేశారు. రైతుల కాలువకు నిధులు ఇవ్వలేని కాంగ్రెస్ సర్కార్‌ను దానం చేసి ఆదుకోండి అంటూ ప్రజలను వేడుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాలువ నిర్మాణం కోసం నిరుడు రూ.3.20 కోట్లు మంజూరు చేయించానని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉత్త మాటలే చెప్పారని విమర్శించారు. నిధులు వస్తే ఇప్పటివరకు పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. రైతులను శాంతింప చేయడం కోసం ఎమ్మెల్యే ఆడిన నాటకమని ఎద్దేవా చేశారు. కనీసం 1.5 కిలోమీటర్ల కాలువ కూడా తవ్వలేని దుస్థితితో సర్కార్ ఉన్నదని దుయ్యబట్టారు. కాలువ పూర్తయితే ఇల్లంతకుంట మండలంలోని 4 గ్రామాలు, తంగళ్లపల్లి మండలంలోని 8 గ్రామాలకు చెందిన 10 వేల ఎకరాలు పూర్తిగా సస్యశ్యామలం అవుతాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

