(Alcohol Students) కర్నూలు: మద్యం సేవించి తరగతులకు హాజరవుతున్న విద్యార్థులపై ఆ పాఠశాల హెడ్ మాస్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యాసంవత్సరం మధ్యలోనే వారికి టీసీలు ఇచ్చి ఇంటికి పంపించి వేశారు. ఈ వార్త శనివారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిజానికి ఈ సంఘటన డిసెంబర్ 1 న జరిగినట్లు తెలుస్తున్నది.
కర్నూలు జిల్లా పరిధిలోని ఆత్మకూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు మద్యం సేవించి తరగతులకు హాజరవుతున్నారు. మద్యం మత్తులో ఉన్న వారిని పాఠశాల సిబ్బంది గుర్తించి వారి స్కూల్ బ్యాగులను తెరిచి వెతికారు. బ్యాగులో రెండు చీప్ లిక్కర్ బాటిళ్లు తొరికాయి. వెంటనే వారు విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సక్రునాయక్ దృష్టికి తీసుకెళ్లగా.. విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి పాఠశాలకు రావాలని సూచించారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు.. మద్యం మత్తులో ఉన్న తమ పిల్లలను చూసి షాక్కు గురయ్యారు. ఇలాంటి విద్యార్థులు తమ స్కూల్లో ఉంటే మిగతా విద్యార్థులు కూడా చెడిపోతారని చెప్పిన హెడ్ మాస్టర్.. తల్లిదండ్రులకు తమ పిల్లల టీసీలు ఇచ్చి పంపించి వేశారు. మద్యం సేవిస్తూ పట్టుబడిన విద్యార్థుల్లో నలుగురు 8వ తరగతి చదువుతుండగా, ఒకరు 9వ తరగతి విద్యార్థి అని తెలిసింది.
గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా? అయితే, ఒకసారి ఆలోచించండి..!
చలికాలంలో వెచ్చదనం ఇచ్చే ఆహారాలు.. ఏవంటే..?
ఈ ‘ముక్కు’ రోగాలను పసిగడుతుంది.. ఎలాగంటే?
ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..