శనివారం 04 జూలై 2020
Andhrapradesh-news - May 28, 2020 , 18:28:09

శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

 శ్రీవారి ఆస్తులపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు

తిరుపతి : శ్రీవారి ఆస్తుల వేలం అంశంపై తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ ) కీలక నిర్ణయం తీసుకున్నది. స్వామివారికి చెందిన భూములు, మాన్యాలు, కానుకలు, విక్రయాన్నీ నిషేధిస్తూ తీర్మానం చేసింది. గురువారం సమావేశమైన టీటీడీ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు నిరుపయోగంగా పడివున్న శ్రీవారి ఆస్తులు, స్థలాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక కమిటీలో పాలకమండలి సభ్యులు, మఠాధిపతులు, స్వామిజీలు, భక్తులు సభ్యులుగా ఉంటారు. అంతేకాకుండా గత పాలకమండలి నిర్ణయాలతో తమపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. టీటీడీ పాలక మండలి తీర్మానంలో పాత అతిధి గృహం పునరుద్ధరణకు పారదర్శకంగా డొనేషన్ విధానంలో పునర్నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లాక్ డౌన్‌లో సడలింపు ఇచ్చిన తరువాత తిరుమలలో భక్తుల దర్శనానికి అనుమతించేందుకు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది.   logo